*అదిలాబాద్ జిల్లా : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నిర్మల్ జిల్లాలోని కుంటాల మండల పరిధిలోని కల్లూర్–కుంటాల రహదారి మార్గం ప్రమాదకరంగా మారింది. బుధవారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షాలతో రహదారి మార్గంలోని అందకూర్ అలుగు ఉధృతంగా ప్రవహించడం మూలంగా అక్కడి ప్రాంతంలోని రోడ్డు భారీ పరిమాణంతో కోతకు గురైంది. రోడ్డుకు ఒక వైపు అధిక భాగం కోతకు గురికావడం మూలంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది, అదిలాబాద్ నుంచి హైదరాబాద్ మార్గంలో వెళ్లే వాహనదారులకు నిర్మల్ పోలీసులు పలు సూచనలు చేశారు.ఆదిలాబాద్ నుంచి కామా రెడ్డి,మీదుగా హైదరాబాద్ వెళ్లే వాహనదారులు నిర్మల్ సమీపంలోని కొండాపూర్ బ్రిడ్జి నుంచి ఎడమ వైపునకు తిరిగి యూటర్న్ తీసుకుని వెళ్లాలని సూచించారు. కొండాపూర్ నుంచి మామడ ఖానాపూర్ మెట్,జగిత్యాల, కరీంనగర్, మీదుగా హైదరాబాద్ వెళ్ళవలసి ఉంటుందని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు.

previous post