📍నేటి నుంచే క్వింటాకు రూ.1,200 చొప్పున ఉల్లి కొనుగోలు చేయాలని ఆదేశం. ఉల్లి పంటను తక్షణమే కొనుగోలు చేసి నిల్వ చేయాలని సీఎం సూచన. కమ్యూనిటీ హాళ్లను అద్దెకు తీసుకుని ఉల్లిని ఆరబెట్టాలన్న సీఎం చంద్రబాబు. రేటు వచ్చే వరకు కమ్యూనిటీ హాళ్లలో నిల్వ చేసుకునేందుకు రైతులకు అవకాశం కల్పించాలని స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు. తక్షణమే ఉల్లి కొనుగోలు చేసి రైతులకు నష్టం రాకుండా చూడాలి. పంట ధరల స్థిరీకరణ కోసం వేర్ హౌసింగ్ సదుపాయం కల్పించాలి. రైతుబజార్ల సంఖ్య పెంచడంతో పాటు ఆధునీకరణ చర్యలు చేపట్టాలి : సీఎం చంద్రబాబు

previous post