నెల్లూరు జిల్లాకు గౌరవం:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్పొరేషన్‌లకు డైరెక్టర్లను నియమిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
ఈ నియామకాలలో నెల్లూరు జిల్లాకు చెందిన ఆరుగురు నాయకులకు చోటు దక్కింది.నెల్లూరు సిటీ నియోజకవర్గానికి చెందిన కపిర శ్రీనివాస్ గారిని ఏపీ స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమించారు.
ఆయన నియామకంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ వర్గానికి న్యాయం జరిగిందని, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.ఈ సందర్భంగా పలువురు బీసీ సంఘ నాయకులు, పార్టీ శ్రేణులు కపిర శ్రీనివాస్‌ను అభినందించారు.