Tv424x7
Andhrapradesh

హమ్మ సజ్జల భార్గవ – దాక్కుంటే పట్టుకోలేరా?

సజ్జల రామకృష్ణారెడ్డి సుపుత్రుడు.. వైసీపీ బూతు సైన్యానికి నాయకుడిగా పని చేసిన సజ్జల భార్గవరెడ్డి ప్రభుత్వం మారిన తర్వాత ఒక్క సారి అంటే ఒక్క సారి కూడా బయట కనిపించ లేదు. అధికారంలో ఉన్నప్పుడు తనకు ఎలివేషన్ వీడియోలను వైసీపీ సోషల్ మీడియా టీమ్‌తోనే వేయించుకునేవారు.

కానీ ఇప్పుడు తన ఫోటోలు కూడా బయటకు రానివ్వడం లేదు.కలుగులో ఎలుకలా బతికేస్తున్నారు. సోషల్ మీడియా పోస్టుల విషయంలో సుప్రీంకోర్టు వరకూ వెళ్లి అరెస్టు కాకుండా తప్పించుకున్నారు కానీ.. ఇప్పుడు ఏకంగా లిక్కర్ కేసులోనే దొరికిపోయిన సూచనలు కనిపిస్తున్నాయి.

లిక్కర్ స్కామ్ సొమ్మును రూటింగ్ చేయడానికి ఏర్పాటు చేసిన ఓ కంపెనీలో సజ్జల భార్గవ కూడా డైరక్టర్ గా ఉన్నట్లుగా సిట్ అధికారులు గుర్తించారు. చెవిరెడ్డి ఇళ్లు, కార్యాలయాలు, వారి బినామీ కంపెనీల ఆఫీసుల్లో నిర్వహించిన సోదాల్లో చాలా డాక్యుమెంట్లు పట్టుబడ్డాయి.

అందులో ఓ కంపెనీలో.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, సజ్జల భార్గవ, ప్రద్యుమ్న అనే వ్యక్తులు భాగస్వాములుగా ఉన్నారు. ఈ ప్రద్యుమ్న ..ఎన్నికల సమయంలో దొరికిన డబ్బు తనదేనని క్లెయిమ్ చేసుకున్నారు. ఎక్కడిదని విచారణ ప్రారంభించడంతో దుబాయ్ పరారయ్యారు.

జగన్ దొరికినా తాము దొరకకుండా ప్లాన్ చేసుకునే సజ్జల

సజ్జల రామకృష్ణారెడ్డి అత్యంత తెలివిగలవాడు. ఆయన పార్టీ నేతలందర్నీ వాడుకుంటారు కానీ.. తాను కానీ.. కుమారుడికి కానీ చిన్న లింకులు బయపడేలా ఎప్పుడూ వ్యవహారాలు నడపరు. కానీ ఆయన వాటా ఆయనకు చేరాల్సిందే.

అయితే ఎవరూ కనిపెట్టలేరని అనుకున్నారేమో కానీ ఓ కంపెనీలో డైరక్టర్ గా కొడుకుల్ని చేర్పించేశాడు. ఇప్పుడు దొరికిపోయాడు. తిరుపతిలో ఓ కంపెనీ పేరుతో ఉన్న చిరునామాలో సోదాలు మరో పది సూట్ కేసు కంపెనీలు అక్కడి నుంచి నడుస్తున్నాయని క్లారిటీ వచ్చింది. అదే పెద్ద తీగ కావడంతో మొత్తం బయటకు లాగుతున్నారు.

ఇప్పుడు కుమారుడు దొరికిపోవడంతో హాహాకారాలు ఖాయం

లిక్కర్ స్కాంలో డబ్బులన్నీ ఇష్టం వచ్చినట్లుగా పంచుకున్నారు. వాటిని వైట్ చేసేందుకు చేయని నేరం లేదు. ఎర్రచందనం స్మగ్లర్ అయిన విజయానందరెడ్డిని ఫేక్ కంపెనీలకు కేరాఫ్ గా వాడుకున్నారు. విజయానందరెడ్డితోనే చెవిరెడ్డి ఎక్కువగా వ్యవహారాలు నడిపారు.

ఇప్పుడు సజ్జల భార్గవరెడ్డి అంశం కూడా బయటకు వస్తోంది. పోలీసులు ఆయనకు రేపోమాపో నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. దీనిపై సజ్జల హాహాకారాలు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

Related posts

భారీ అక్రమ మద్యం స్వాధీనం- అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేదే లేదు- సీఐ చాంద్ బాషా

TV4-24X7 News

మహిళపై అత్యాచారం..ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన దువ్వూరు పోలీసులు

TV4-24X7 News

పుట్టాసుధాకర్ ఆధ్వర్యంలో వైసీపీ కి చెందిన 60 కుటుంబాలు టీడీపీ లోకి చేరిక

TV4-24X7 News

Leave a Comment