న్యూఢిల్లీ :
భారత రాజ్యాంగం ప్రకారం దేశంలో రెండో అత్యున్నత పదవి ఉప రాష్ట్రపతి. అయితే, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ హోదాకు ప్రత్యక్షంగా ఎలాంటి జీతం ఉండదు.
ఉప రాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఆ హోదాలోనే ఆయన వేతనం, భత్యాలు పొందుతారు.సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ ఆఫీసర్స్ ఆఫ్ పార్లమెంట్ యాక్ట్ -1953 ప్రకారం, ఉప రాష్ట్రపతి జీతానికి ప్రత్యేక నిబంధనలే లేవని అధికారులు స్పష్టం చేశారు.
👉 రాజ్యసభ చైర్మన్‌గా నెలకు రూ.4 లక్షలు, అంటే ఏడాదికి రూ.48 లక్షలు వేతనం లభిస్తుంది. అదనంగా ఉచిత నివాస సౌకర్యం, వైద్య సేవలు, ప్రయాణ ఖర్చులు, ల్యాండ్‌లైన్/మొబైల్ ఫోను, వ్యక్తిగత భద్రత, సిబ్బంది వంటి అనేక సౌకర్యాలు లభిస్తాయి.
పదవీ విరమణ అనంతరం ఉప రాష్ట్రపతి పదవిని కనీసం రెండేళ్లకు పైగా నిర్వర్తించిన వారికి మాత్రమే పింఛను అర్హత ఉంటుంది.
అలాంటివారికి నెలకు సుమారు రూ.2 లక్షల పింఛనుతో పాటు టైప్-8 బంగ్లా ఉచితంగా కేటాయించబడుతుంది. అలాగే, మాజీ ఉప రాష్ట్రపతికి సెక్రటరీ, అదనపు సెక్రటరీ, వ్యక్తిగత సహాయకుడు, వైద్యుడు, నర్సింగ్ అధికారి, నలుగురు వ్యక్తిగత సిబ్బందిని కూడా కేంద్రం సమకూర్చుతుంది.
📌 పేరుకు దేశంలో రెండో అత్యున్నత హోదా అయినా.. ప్రత్యక్ష జీతం లేని పదవి ఉప రాష్ట్రపతిదే!
అనూష