ఈ రోజు అనగా 08.09.2025 తేదీన అనంతపురము ప్రాంతీయ నిఘా మరియు అమలు అధికారి అయిన శ్రీ Y.B.P.T.A. ప్రసాద్ వారి ఆదేశాల మేరకు రెవిన్యూ అధికారులతో కలసి విజలెన్స్ అధికారులు అనంతపురము జిల్లా తాడిపత్రి టౌన్ GVP కాలనీ నందు సోమన్నగారి నాగార్జున ఇంటి వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన 45.70 Qtls (99 బస్తాలు) PDS బియ్యము మరియు 18.50 Qtls (50 బస్తాలు) PDS జొన్నలును జప్తు చేసి E.C. Act,1955 నిబంధనల మేరకు చట్టపరమైన చర్యలు తీసుకొను నిమిత్తం రెవెన్యూ అధికారి, తహశీల్దారు కార్యాలయం, తాడిపత్రి మండలం గారికి స్వాధీనపరచడం జరిగినది. తదుపరి నిందితుడు 1) సోమన్నగారి నాగార్జున, తాడిపత్రి టౌన్, పై తాడిపత్రి పోలీసు స్టేషన్ నందు క్రిమినల్ కేసు నమోదు చేయించడమైనది.
తనిఖీ అధికారులు: S.I.: శ్రీ S.నరేంద్ర భూపతి; CSDT: శ్రీ పి.మల్లేష్ ప్రసాద్, C.S.D.T, O/o.తహశీల్దారు కార్యాలయం, తాడిపత్రి; శ్రీ కే. వెంకటస్వామి, VRO-గాన్నవారిపల్లి కాలని, తాడిపత్రి మండలం మరియు సిబ్బంది.