మెట్‌పల్లి మాజీ జడ్పీటీసీ కాటిపెల్లి రాధ శ్రీనివాస్ దంపతుల కుమారుడు శ్రీకర్ రెడ్డి (28) మృతదేహం లభ్యమైంది. 13 రోజుల క్రితం వినాయక విగ్రహాన్ని ఎస్సారెస్పి కాలువలో తీసుకెళ్తున్న సమయంలో ట్రాక్టర్ అదుపు తప్పి ఆయన గల్లంతైన విషయం తెలిసిందే.
తాటిపెల్లి గ్రామ శివారులోని ఎస్సారెస్పి కాలువలో గాలింపు చర్యల మధ్య ఆయన మృతదేహం బయటపడింది. గత కొన్ని రోజులుగా పోలీసులు, మత్స్యకారులు, రెవెన్యూ అధికారులు ఆయన ఆచూకీ కోసం కృషి చేశారు.
👉 స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
అనూష