జనగామ జిల్లా, పెంబర్తి:
జనగామ మండలం పెంబర్తి మహాత్మ జ్యోతిరావు ఫూలే బాలికల గురుకుల పాఠశాలలో ఆశ్చర్యకర సంఘటన చోటుచేసుకుంది.
ఓ వ్యక్తి బీరు బాటిల్ పట్టుకొని కళాశాల ప్రాంగణంలోకి ప్రవేశించగా, ఈ విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రైవేట్ వ్యక్తి హాస్టల్ ప్రాంగణంలోకి స్వేచ్ఛగా వెళ్లడం చూసి తల్లిదండ్రులు గేటు వద్ద ఆందోళన చేపట్టారు.
విద్యార్థినుల భద్రత పట్ల అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు.”చిన్నార్లు, బాలికలు ఉన్న హాస్టల్లోకి ఇలాంటివారు బీరు బాటిళ్లతో ప్రవేశిస్తే భవిష్యత్తులో ఏమి జరుగుతుందో?” అని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.
భద్రతా చర్యలు లేకపోవడమే ఈ ఘటనకు కారణమని వారు ఆరోపించారు.తక్షణమే హాస్టల్ భద్రతను కట్టుదిట్టం చేసి, విద్యార్థినులకు రక్షణ కల్పించాల్సిందిగా తల్లిదండ్రులు అధికారులు కోరుతున్నారు.
అనూష