◼️ *|| కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ను … కొల్లగొట్టారా …❓ బ్యాంక్ నే బోంద పెట్టిన టౌన్ బ్యాంక్ సిబ్బంది …❓||* ◼️▪️అనంతపురం జిల్లాలో ది అనంతపురం కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లో బయట పడ్డ భారీ స్కాం.▪️నకిలీ పత్రాలతో రుణాలు మంజూరు చేసుకొని కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ సిబ్బంది మూడు పూలు ఆరు కాయలుగా నడుస్తుందా …❓▪️టౌన్ బ్యాంక్ అధ్యక్షుడు నీ ఎన్నుకునే సమయములో ఇచ్చిన ప్రూఫ్స్ తో ఆధార్ కార్డులు,మరి కొన్ని పత్రాలతో రుణాలు మంజూరు చేసుకొని దర్జాగా జల్సాలు చేస్తున్న *ది అనంతపురం కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ సిబ్బంది*▪️ *ది అనంతపురం కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్* లో బయట పడ్డ ఈ భారీ స్కాం ఆలస్యంగా వెలుగులోకి కారణం ఎందుకో …❓ ఈ స్కాం లో తిమింగలాలు తప్పించుకోవడానికేనా …❓ సాక్షాలు,ఆధారాలతో సహా బయట పెట్టిన కూడా ఎందుకు పై అధికారులు స్పందించడం లేదో …❓ ఆ టౌన్ బ్యాంక్ లో రుణాలు ఎంత వరకు సేఫ్ …❓▪️టౌన్ బ్యాంక్ లో అవకతవకలు జరిగినట్లు బాధితులు వచ్చి సాక్షాలు ఆధారాలతో బయట పెట్టిన కూడ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న టౌన్ బ్యాంక్ అధ్యక్షులు …❓▪️ *ది అనంతపురం కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ సిబ్బంది* బ్యాంక్ లో రుణం తీసుకున్నారు అని బాధితుడు కు ఫోన్ చేసిన టౌన్ బ్యాంక్ మేనేజర్ … వెంటనే తేరుకున్న బాధితుడు టౌన్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ లో వెళ్ళి ప్రశ్నించగా నీళ్ళు నములుతున్న టౌన్ బ్యాంక్ సిబ్బంది.▪️బాధితుడు మరియు మీడియా సాక్ష్యాలు ఆధారాలతో సహా బ్యాంకుకు వెళ్ళి ప్రశ్నించగా మీడియా ప్రతినిధి పై దుర్బాషలడుతు, కేసు పెడతాను అంటు బెదిరిస్తున్న టౌన్ బ్యాంక్ సిబ్బంది.▪️బాధితుడు ఫోటో తో పక్కగా ప్లాన్ వేసి పాస్ బుక్ తో సహా మొబైల్ నంబర్ సిబ్బందిదే వేసుకోని, నకిలీ సంతకాలతో లోన్ మంజూరు చేసుకున్న సిబ్బంది … ఇలాంటి నకిలీ అకౌంట్లు ఇంకా *ది అనంతపురం కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లో* ఎన్ని ఉన్నాయో …❓▪️అర్బన్ బ్యాంక్ లో జరిగిన అవకతవకల పై ఫిర్యాదు చేసినా అటు బ్యాంక్ అధికారులు కానీ పోలీసులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు అని బాధితులు వాపోతున్నారు.

previous post