కమలాపురం :- దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు ఈరోజు అంబేద్కర్ గురుకులం బాలికల పాఠశాలలో నియోజకవర్గ పరిధిలోని దివ్యాంగులకు మంజూరైన బ్యాటరీ ట్రైసైకిళ్లు, వీల్ చైర్లు వంటి ఉపకరణాలు పంపిణీ చేశారు. నియోజకవర్గ పరిధిలోని 1203 మందికి 17 రకాల 1823 ఉపకరణాలు మంజూరు అయ్యాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ వికలాంగులకు ఉపకరణాలు శారీరక ఉన్నత ని పెంచుతాయన్నారు. ప్రభుత్వం చొరవ చూపి రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన ట్రైసైకిళ్లను ఇతర ఉపకరణాలను పంచడం శుభపరిణామం అన్నారు. జిల్లాలోని అత్యధికంగా 1203 మందికి మన నియోజకవర్గంలో పంపిణీ చేయడం జరిగిందన్నారు. పెన్షన్లతోపాటు ఇలాంటి దివ్యాంగులకు ఉపకరణాలను పంపిణీ చేయడం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.యమ్.యల్.ఎను శాల్వతో సత్కరించారు. ట్రై సైకిల్ లు పంపిణీ

previous post