Tv424x7
Andhrapradesh

సైనిక్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష తేదీ మార్పు

🟦దేశవ్యాప్తంగా సైనిక పాఠశాలల్లో ప్రవేశాల కోసం ఇచ్చిన షెడ్యూల్‌లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం(2024-25)లో ఆరు, తొమ్మిది తరగతుల్లో ప్రవేశాలకు ఆలిండియా సైనిక్‌ స్కూల్స్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ (AISSEE 2024) దరఖాస్తులకు గడువు శనివారంతో ముగియనుండంతో ఆ గడువును పొడిగించారు. గతంలో డిసెంబర్‌ 16 వరకు దరఖాస్తులకు గడువు ఉండగా.. దాన్ని డిసెంబర్‌ 20 వరకు ఎన్టీఏ పొడిగించింది. అలాగే, ఈ పరీక్ష తేదీని జనవరి 21 నుంచి జనవరి 28(ఆదివారం)కి మార్పు చేసింది. పరీక్ష ఫీజును డిసెంబర్‌ 20 రాత్రి 11.50గంటల వరకు చెల్లించవచ్చని తెలిపారు. దరఖాస్తుల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే డిసెంబర్‌ 22 నుంచి 24వ తేదీ వరకు సవరించుకొనేందుకు అవకాశం కల్పించారు.

🟦పూర్తి సమాచారం కోసం https://exams.nta.ac.in/AISSEE

Related posts

ఏపీ పోలీసు అధికారులపై ఈసీకి మరోసారి బీజేపీ ఫిర్యాదు

TV4-24X7 News

డాక్టర్ సునీత నర్రెడ్డి ఐడీఎస్‌ఏ ఫెలోగా ఎన్నిక…

TV4-24X7 News

తెప్పోత్సవం రద్దు!!

TV4-24X7 News

Leave a Comment