Tv424x7
Andhrapradesh

తెప్పోత్సవం రద్దు!!

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం దసరా రోజున నిర్వహించే తెప్పోత్సవం ఈ ఏడాది కూడా రద్దయింది.

కృష్ణా నదిలో వరదనీరు భారీగా చేరడంతో, భద్రతా కారణాల దృష్ట్యా నీటిపారుదల శాఖ ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేదు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

గత రెండు సంవత్సరాల్లోనూ (2022, 2023) దసరా రోజు వర్షాల కారణంగా తెప్పోత్సవం జరగలేదు. ఈసారి వరదల నేపథ్యంలో భక్తుల రక్షణను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

మరోవైపు, దసరా ఉత్సవాల భాగంగా ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నుంచి అమ్మవారికి సారె సమర్పణ కార్యక్రమం జరిగింది.

👉 భక్తులు ఆలయాన్ని సందర్శించి అమ్మవారి ఆశీర్వాదాలను పొందుతున్నారు.

Related posts

పవన్‌ను కలిసిన హైడ్రా కమిషనర్ – విశేషమేనా?

TV4-24X7 News

ఉప్పాల హారికను ఫోన్‌లో పరామర్శించిన వైఎస్ జగన్

TV4-24X7 News

నారావారిపల్లెలో గ్రామ దేవతలకు చంద్రబాబు పూజలు

TV4-24X7 News

Leave a Comment