Tv424x7
Andhrapradesh

కోనసీమ వాసుల మధ్య సీఎం జగన్‌ చిచ్చు పెట్టారు

అమలాపురం: కోనసీమ ప్రజల మధ్య ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ( CM JAGAN ), వైసీపీ నేతలు చిచ్చు రగిలిచ్చారని మాజీ ఎంపీ హర్ష కుమార్ ( Harsha Kumar ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు..శనివారం నాడు ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ…”దళిత, దళితేతరుల మధ్య జగన్ అంతరం సృష్టించారు. జిల్లా పేరుతో కావాలని వైసీపీ ప్రభుత్వం కావాలని నాటకాలు అడింది. అన్ని జిల్లాలు ప్రకటిచ్చినప్పుడు ఆనాడే అంబేద్కర్ పేరు పెట్టి ఉంటే నా సోదరులకు అభ్యంతరం ఉండేది కాదు. జిల్లా పేరు పెట్టడంపై అభ్యంతరాలు తెలపమని చెప్పి ఉద్యమాన్ని లేవదీశారు..ఉద్యమంతో సంబంధం ఉన్న వాళ్లని, లేని వాళ్లని అందర్నీ పోలీసులు లోపలేశారు. గ్రామీణ ప్రాంతాలల్లో కుల మతాలకు అతీతంగా మావా, బావ, అంటూ బంధుత్వాలతో పెంచుకునే నేపథ్యం ఉండేది. కానీ కొంతమంది వల్ల ఈ కులాల మధ్య వ్యత్యాసం అనేది దూరం దూరంగా పెరిగిపోయింది. 22వ తేదీన సాయంత్రం 4 గంటలకు అల్లవరం మండలం కోడూరుపాడు గ్రామంలో నా అభిమానులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారని..ఈ కార్యక్రమంలో నా అభిమానులు అందరూ పాల్గొనాలి” అని హర్ష కుమార్ పిలుపునిచ్చారు..

Related posts

జేసీ ప్రభాకర్ రెడ్డి పై ఈడీ చార్జ్ షీట్

TV4-24X7 News

నాడు కానిస్టేబుల్…. నేడు బాస్…

TV4-24X7 News

గవర్నర్‌ను కలవనున్న వైఎస్ షర్మిల

TV4-24X7 News

Leave a Comment