సీఎం జిల్లా పర్యటనను… విజయవంతం చేయండి !** *జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు** *ఏ.ఎస్.ఎల్. నిర్వహణలో భాగంగా.. కడప నగరంలో సీఎం పర్యటించే పలు ప్రాంతాల్లో ఏర్పాట్ల పరిశీలన*కడప, డిసెంబర్ 20 : ఈ నెల 23, 24, 25వ తేదీల్లో జిల్లాలో పర్యటించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు అధికారులను ఆదేశించారు.బుధవారం కడప నగరంలోని రిమ్స్ హెలీ ప్యాడ్, ముఖ్యమంత్రి ప్రారంభించనున్న రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సైకియాట్రిక్ హాస్పిటల్, క్యాన్సర్ కేర్ హాస్పిటల్, ఎల్.వి.ప్రసాద్ ఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లతో పాటు వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్లెడ్ లైట్లను.. జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు.. జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్, జేసీ గణేష్ కుమార్, కడప నగర కమీషనర్ జి.ఎస్.ఎస్. ప్రవీణ్ చంద్, అసిస్టెంట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఆర్డీవో మధుసూదన్ లతో కలిసి పరిశీలించారు. అనంతరం.. ఆధునీకరించిన వైఎస్ఆర్ జిల్లా కలెక్టరేట్ ప్రధాన భవనాన్ని, ఆర్టీసీ బస్టాండ్ వద్ద నవీనీకరించిన డా. బి.ఆర్ అంబెడ్కర్ సర్కిల్, కోటిరెడ్డి సర్కిల్, 7 రోడ్స్ సర్కిల్ లను, అక్కడ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్బంగా అధికారులకు ఆయన పలు సూచనలు జారీ చేశారు. అనంతరం ఏఎస్ఎల్ నిర్వహణలో భాగంగా కడప విమానాశ్రయం, అటు నుండి బద్వేలుకు వెళ్లారు

previous post