Tv424x7
Telangana

మోడీని చిత్తుచిత్తుగా ఓడిస్తా.. పాల్ సంచలన వ్యాఖ్యలు..

K.A Paul: ఢిల్లీ..ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్ లేదా మల్కాజిగిరి నుంచి పార్లమెంట్ కు పోటీ చేస్తారని అంటున్నారు..తెలుగు సత్తా చూపించేందుకు మోడీని చిత్తుచిత్తుగా ఓడించేందుకు మోడీపై పోటీ చేస్తానని హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు తనది గ్యారెంటీ అన్నారు. తనలాంటి వాడికి పార్లమెంటు వెళ్లే అవకాశం ఇవ్వాలని కోరారు..నేను తప్ప ఎవరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అప్పులు తీర్చలేరని కేఏ పాల్ అన్నారు. వడ్డీలు కూడా కట్టలేదు ఇతర సాకులతో గడిపేస్తారని విమర్శించారు. ప్రజాశాంతి పార్టీకి ఇక సింబల్ రానుందని కేఏ పాల్ తెలిపారు. టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేయాలనుకునే వాళ్లను రూ.50 కోట్లు అడుగుతున్నారట.. దేశంలో రాష్ట్రంలో అప్పులు తీరాలంటే జనవరి 30న గ్లోబల్ సమ్మిట్ జరగాలని ఆయన పేర్కొన్నారు. జేడీ లక్ష్మీనారాయణ పార్టీ పెట్టేందుకు ఆర్ఎస్ఎస్, బీజేపీలు 1000 కోట్ల రూపాయలు ఇచ్చారని తెలిపారు. గతంలో విదేశాంగ శాఖ మంత్రిగా ప్రభుత్వంలోకి రావాలని మోడీ, అమిత్ షాలు కోరారు.తాను వెళ్ళలేదని కేఏ పాల్ తెలిపారు..

Related posts

కీలక అరెస్టులకు గవర్నర్ అనుమతి వచ్చేసిందా?

TV4-24X7 News

ఇందిరాపార్క్ వద్ద భారీగా ఆటో డ్రైవర్లు మహా ధర్నా!!

TV4-24X7 News

అల్లు అర్జున్ విడుద‌ల‌పై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..

TV4-24X7 News

Leave a Comment