ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వీరశేఖర్ డిమాండ్*
బి కోడూరు మండలం కామకుంట గ్రామ సమీపంలోని ఐదు ఎకరాలు ప్రభుత్వ భూమి సర్వేనెంబర్ 14/30 ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సదరు భూములను ప్రభుత్వం మోడల్ స్కూల్ కోసం ఈ స్థలాన్ని కేటాయించడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం (BKMU) జిల్లా అధ్యక్షులు వీరశేఖర్, సిపిఐ మండల కార్యదర్శి ఎర్రబల్లె ప్రసాదరావు. గురువారం బి,కోడూరు మండలంలోని కామకుంట సమీపంలో ఉన్న భూమిని పరిశీలించారు .ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కొంతమంది పలుకుబడి కలిగిన నాయకులు మోడల్ స్కూల్ కేటాయించిన ఆ భూమిపై అధికార పార్టీ నాయకులు కన్నేసి సంబంధిత భూమిని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు ఇప్పటికైనా రెవిన్యూ అధికారులు శుద్ధితో చదువుకునే విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆ స్థలాన్ని కేటాయించి భావి తరాలకు ఉపయోగ పడేవిధంగా తీసుకొని ఈ ప్రాంత ప్రజలకు మేలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ప్రభుత్వం యంత్రాంగం ద్వారా రాళ్ల తిప్పల పొలాన్ని మోడల్ స్కూలుకు ఉపయోగించడం లేదా పేద దళిత వర్గాలకు చెందిన వారికి ఇళ్ల స్థలాలకు ఈ భూమిని కేటాయించాలని డిమాండ్ చేశారు. మోడల్ స్కూలుకు కేటాయించకపోతే అక్కడ ఉన్న దళితులకు బలహీన వర్గాలకు కేటాయించాలని ఆ డిమాండ్ సాధన కోసం వ్యవసాయ కార్మిక సంఘం ఉద్యమిస్తుందని ఆయన హెచ్చరించారు ఈ పర్యటనలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు దివాకర్ విజయ్ రవి హర్ష తదితరులు పాల్గొన్నారు