కడప/దువ్వూరు చిన్న సింగనపల్లి గ్రామంలో స్వల్ప వర్షానికే రోడ్డు చెరువును తలపించే పరిస్థితి నెలకొంది. రోడ్డుకు మొదలు, చివర భాగాలను వదిలి మధ్యలో మాత్రమే సీసీ (CC) రోడ్డు నిర్మించడం వల్ల వర్షపు నీరు వెళ్లే మార్గం లేక ప్రజల ఇళ్ల వద్ద నీరు నిలిచిపోతోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి సమస్యలు వస్తాయని గతంలోనే రోడ్డు నిర్మాణంపై *బీజేపీ నాయకులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. అయినప్పటికీ సమస్యను పట్టించుకోకపోవడం వల్ల ప్రస్తుతం చిన్నపాటి వర్షానికే రోడ్డు చెరువును తలపించే పరిస్థితి ఏర్పడిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్థులు కోరుతున్నారు.

