శబరిమల అయ్యప్ప భక్తులతో కిక్కిరిపోతోంది. స్వాముల రద్దీతో ఇసుక వేస్తే రాలని పరిస్థితి నెలకొంది. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాల నుంచి అయ్యప్ప భక్తులు తండోపతండాలుగా తరలిరావడంతో భక్తుల రద్దీతో శబరిమల కిటకిటలాడుతోంది. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలో మీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి.
