Tv424x7
Andhrapradesh

ఈసీకి పురంధరేశ్వరి లేఖ.. ఏం చెప్పారంటే..?

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘానికి ( Central Election Commission ) బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ( Purandhareswari ) శనివారం లేఖ రాశారు..ఓటర్ల జాబితా మరియు EPICలకు సంబంధించి లేఖలో కొన్ని సమస్యలను లేవనెత్తారు. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంలో వేలకొద్దీ నకిలీ ఓటర్లు ఉన్నట్లు ఫిర్యాదు చేశారు. మార్చి 2021లో జరిగిన తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం ఉపఎన్నికల సందర్భంగా వేల సంఖ్యలో నకిలీ ఓట్లు పోలయ్యాయని లేఖలో ఫిర్యాదు చేశారు. EPIC కార్డుల డిజిటల్ ప్రింట్‌ అవుట్ల డేటాను కూడా సమర్పించారని.. అందులో 35000 ఎపిక్ కార్డులను అక్రమంగా డౌన్‌లోడ్ చేశారని తేలిందన్నారు. డీఈవో ఇచ్చిన సమాచారం మేరకు క్రిమినల్‌ కేసు నమోదు చేశారని పురంధరేశ్వరి లేఖలో ఫిర్యాదు చేశారు..

Related posts

ఏపీ రాజధాని అమరావతి లో అంతర్జాతీయ గోల్ఫ్ కోర్స్ ?

TV4-24X7 News

కుటుంబ సమేతంగా నాగులచవితి పండుగ మహోత్సవంలో పాల్గొన్న విల్లూరి

TV4-24X7 News

ఓటర్ల జాబితా పంచాయితీకి పుల్‌స్టాప్.. డెడ్‌లైన్ చెప్పేసిన ఎన్నికల కమిషన్.!

TV4-24X7 News

Leave a Comment