Tv424x7
Andhrapradesh

రాంగోపాల్ వర్మకు మరో ఎదురుదెబ్బ

వ్యూహం సినిమాను ఓటీటీలోనూ విడుదల చేయొద్దన్న కోర్టు*వ్యూహం సినిమాలో చంద్రబాబును కించపరిచేలా సీన్లు ఉన్నాయంటూ కోర్టుకెక్కిన నారా లోకేశ్వ్యూహం సినిమాపై తీర్పును 22కు వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టుఆన్‌లైన్, ఓటీటీ, ఇంటర్నెట్‌ వేదికల్లోనూ విడుదల చేయొద్దన్న హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టువ్యూహం సినిమా విషయంలో దర్శకుడు రాంగోపాల్ వర్మకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కోర్టు తీర్పు నేపథ్యంలో సినిమా విడుదల ఇప్పటికే వాయిదా పడింది. ఈ సినిమాలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని కించ పరిచేలా సన్నివేశాలు ఉన్నాయంటూ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడంతో సీబీఎఫ్‌సీ జారీ చేసిన సర్టిఫికెట్‌ను నిలిపి వేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఉత్వర్వులపై వ్యూహం సినిమా నిర్మాత కోర్టును ఆశ్రయించారు. విచారణ ముగియడంతో నిన్నటికి తీర్పును వాయిదా వేసిన కోర్టు.. నిన్న మరోమారు వాయిదా వేస్తూ ఈ నెల 22న తీర్పును వెలువరిస్తామని తెలిపింది. మరోవైపు, వ్యూహం సినిమాను ఓటీటీ, ఆన్‌లైన్, ఇంటర్నెట్ వేదికల్లోనూ విడుదల చేయవద్దని నిన్న హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది.

Related posts

వైకాపా ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డిపై సెర్చ్ వారెంట్

TV4-24X7 News

ఘనంగా అష్టదళ పద్మారాధన

TV4-24X7 News

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు కేబినెట్ సమావేశం

TV4-24X7 News

Leave a Comment