Tv424x7
Andhrapradesh

వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్మెస్ స్వామినాథన్‌కు భారతరత్న..

వ్యవసాయ శాస్త్రవేత్త, డాక్టర్ ఎమ్మెస్ స్వామినాథన్‌కు భారతరత్న వరించింది. వ్యవసాయం, రైతుల సంక్షేమంలో ఆయన చేసిన సేవలను భారత ప్రభుత్వం గుర్తించింది.దీంతో ఆయనకు భారత రత్న ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రధాని మోడీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పష్టం చేశారు. డాక్టర్ MS స్వామినాథ జీకి భారతరత్న ప్రదానం చేయడం చాలా సంతోషంగా ఉందని మోడీ తెలిపారు. ఎన్నో సవాళ్ల సమయంలో వ్యవసాయ రంగంలో భారతదేశం స్వావలంబన సాధించడంలో ఎమ్మెస్ స్వామినాథన్ కీలక పాత్ర పోషించారని ఆయన పేర్కొన్నారు.భారతీయ వ్యవసాయాన్ని ఆధునీకరించే దిశగా స్వామినాథన్ అద్భుతమైన ప్రయత్నాలు చేశారన్నారు. అందుకే ఆయన చేసిన సేవలను భారత ప్రభుత్వం గుర్తించిందని పేర్కొన్నారు. వ్యవసాయంపై విద్యార్థుల్లో అభ్యాసం, పరిశోధనలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. డాక్టర్ స్వామినాథన్ గొప్ప దార్శనికుడని మోడీ ప్రశంసలు కురిపించారు..

Related posts

ఏపీ ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్ కు ఘన సత్కారం గంట్ల

TV4-24X7 News

కందుల ఆధ్వర్యంలో కళ్లద్దాలు పంపిణీ మహిళ కార్యకర్తలకు చీరల పంపిణీ

TV4-24X7 News

ఎమ్మెల్యే ల తలరాత రాసే జీత గాడు ఐప్యాక్

TV4-24X7 News

Leave a Comment