Tv424x7
Andhrapradesh

సినీ హీరో మహేశ్‌బాబు కుమార్తె… సితార పేరుతో ఇన్వెస్ట్ మెంట్ లింకులు.. క్లిక్ చేస్తే అయిపోయినట్టే

సైబర్ మోసాలకు తెగబడుతున్న నేరగాళ్లుఇన్‌స్టాగ్రామ్‌లో సితార పేరుతో నకిలీ ఖాతాలుఇలాంటి వాటిని నమ్మొద్దన్న జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థసైబర్ నేరగాళ్లు అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు తనయ సితార పేరుతో కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. ఆమె పేరుపై ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ఖాతాలు సృష్టించి ఇన్వెస్ట్ మెంట్, ట్రేడింగ్ లింకులు పంపుతూ మోసాలకు పాల్పడుతున్నారు. ఎవరైనా ఆ లింకులపై క్లిక్ చేస్తే వారి ఖాతాలు గుల్లయినట్టే. ఈ లింకులను గుర్తించిన జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం మాట్లాడుతూ ఇలాంటి లింకులను నమ్మవద్దని, సెలబ్రిటీల పేరుతో వచ్చే ఇలాంటి లింకులపై క్లిక్ చేసి కష్టాలపాలు కావొద్దని సూచించింది.

Related posts

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయిని అడ్డుకున్న వైసీపీ శ్రేణులు..

TV4-24X7 News

ఎర్నిమాంబ అమ్మవారికి ప్రత్యేక హారతులు ఇస్తున్న అర్చకులు శ్రీకాంతశర్మ

TV4-24X7 News

వివేకా పీఏ ఇంటికి పోలీసులు.. వాంగ్మూలం నమోదు

TV4-24X7 News

Leave a Comment