Tv424x7
Andhrapradesh

రాజధాని ఫైల్స్’ సినిమా రిలీజ్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

అమరావతి, ఫిబ్రవరి 16: ఎట్టకేలకు ”రాజధాని ఫైల్స్” సినిమా (Rajdhani Files Movie) రిలీజ్‌కు అడ్డంకులు తొలగిపోయాయి. రాజధాని ఫైల్స్ విడుదలకు హైకోర్టు (AP HighCourt) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్‌లు, రికార్డ్‌లు సక్రమంగానే ఉన్నాయని కోర్టు చెప్పింది. అయితే ఈ చిత్రం విడుదలను నిలిపివేయాలంటూ వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. నిన్న (గురువారం) కోర్టు స్టే విధించింది. మరోసారి ఈ రోజు (శుక్రవారం) విచారణకు రాగా… సీఎం, ప్రభుత్వం ఇమేజ్‌ను దెబ్బ తీసే విధంగా సినిమా ఉందని పిటిషన్ తరపున న్యాయవాది కోర్టుకు చెప్పారు. స్టేను కొనసాగించాలని కోరారు. అయితే స్టే కొనసాగించేందుకు ధర్మాసనం తిరస్కరించింది. నిరభ్యంతరంగా సినిమాను విడుదల చేసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో రాజధాని ఫైల్స్ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర నిర్వహకులు సన్నాహాలు చేపట్టారు..కాగా.. ఈనెల 15న సినిమా విడుదల కావాల్సి ఉండగా.. విడుదలను నిలిపివేయాలంటూ హైకోర్టు గురువారం స్టే విధించిన విషయం తెలిసిందే. సినిమాకు సంబంధించిన పూర్తి రికార్డులను అందజేయాలని న్యాయస్థానం ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు (గురువారం) సినిమా నిర్వహకులు.. సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్‌లు, రికార్డ్‌లను కోర్టుకు సమర్పించారు. దీంతో అన్ని సక్రమంగానే ఉన్నాయని, సినిమా విడుదలకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ హైకోర్టు తేల్చిచెప్పింది..ఆంధ్రప్రదేశ్ రాజధాని నేపథ్యంలో రాజధాని ఫైల్స్‌ చిత్రాన్ని భానుప్రకాశ్‌ తెరకెక్కించగా.. కంఠంనేని రవిశంకర్ నిర్మించారు. ఈ చిత్రంలో వినోద్ కుమార్, వాణీ విశ్వనాథ్ నటించారు..

Related posts

ఎమ్మెల్యే పుట్టా ఆదేశాలతో కేసీ కెనాల్ పై తుమ్మచెట్లు తొలగింపు

TV4-24X7 News

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు…

TV4-24X7 News

తెలంగాణ వ్యక్తికి ఎంపీ టికెట్ ఇచ్చిన చంద్రబాబు

TV4-24X7 News

Leave a Comment