Tv424x7
Andhrapradesh

కళ్ళ ముందే భర్త హత్య…మనస్థాపనతో భార్య మృతి

అనంతపురం:కళ్ళ ముందే భర్త హత్య జరగడంతో తట్టుకోలేక మనస్థాపనతో భార్య మృతి చెందిన ఘటన అనంతపురంలో చోటుచేసుకుంది. వన్ టౌన్ సిఐ రెడ్డప్ప తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని జేఎన్టీయూ సమీపంలో మూర్తి రావు గోకులే(59), ఆయన భార్య శోభ (56), నివసిస్తున్నారు. మూర్తిరావు ఉద్యోగం ఇప్పిస్తానని గతంలో తన మేనల్లుడు ఆదిత్య దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఈ విషయంలో ఆదివారం రాత్రి ఇరువురి మధ్య గొడవ జరిగింది. మాటా మాటా పెరగడంతో కత్తితో ఆదిత్య మూర్తి రావు గొంతు కోసి హతమార్చాడు కళ్ళముందే భర్త మరణించడంతో జీర్ణించుకోలేక ఆదివారం అర్ధరాత్రి శోభ గుండెపోటుతో మృతి చెందారు దంపతుల మృతితో ఇంటివద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి.

Related posts

దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు.. సౌత్ ఇండియాలో 19 చోట్ల తనిఖీలు

TV4-24X7 News

బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరాం: సీతారాం నాయక్, జలగం, సైదిరెడ్డి

TV4-24X7 News

నాదీ రాయలసీమే.. వైఎస్ జగన్ వార్నింగ్‌పై తిరుపతి ఎస్పీ రియాక్షన్

TV4-24X7 News

Leave a Comment