Tv424x7
Andhrapradesh

కళ్ళ ముందే భర్త హత్య…మనస్థాపనతో భార్య మృతి

అనంతపురం:కళ్ళ ముందే భర్త హత్య జరగడంతో తట్టుకోలేక మనస్థాపనతో భార్య మృతి చెందిన ఘటన అనంతపురంలో చోటుచేసుకుంది. వన్ టౌన్ సిఐ రెడ్డప్ప తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని జేఎన్టీయూ సమీపంలో మూర్తి రావు గోకులే(59), ఆయన భార్య శోభ (56), నివసిస్తున్నారు. మూర్తిరావు ఉద్యోగం ఇప్పిస్తానని గతంలో తన మేనల్లుడు ఆదిత్య దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఈ విషయంలో ఆదివారం రాత్రి ఇరువురి మధ్య గొడవ జరిగింది. మాటా మాటా పెరగడంతో కత్తితో ఆదిత్య మూర్తి రావు గొంతు కోసి హతమార్చాడు కళ్ళముందే భర్త మరణించడంతో జీర్ణించుకోలేక ఆదివారం అర్ధరాత్రి శోభ గుండెపోటుతో మృతి చెందారు దంపతుల మృతితో ఇంటివద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి.

Related posts

ఆ బిడ్డకు తండ్రి ఎవరు,డీఎన్ఏ టెస్ట్ చేయించండి..హోంమంత్రిని కలిసిన శాంతి భర్త

TV4-24X7 News

హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా చిలకపేట యూత్ బాయ్స్

TV4-24X7 News

జనసేన అధినేత , డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ తో వంశీ

TV4-24X7 News

Leave a Comment