Tv424x7
Andhrapradesh

వైయస్సార్ చేయూత… నాల్గవ విడత మెగా చెక్కులను విడుదల చేసిన ఎమ్మెల్యే రఘురామిరెడ్డి

వైయస్సార్ చేయూత సంక్షేమ పథకం ద్వారా 45-60 ఏళ్ళ వయస్సున్న యస్సీ యస్టీ బిసి ముస్లిం మైనారిటీ మహిళలకు 75వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడంలో భాగంగా… నేడు… నాల్గవ విడత నిధులకు సంబంధించి మెగా చెక్కులను ఎమ్మెల్యే రఘురామిరెడ్డి లబ్దిదారులకు అందజేశారు. కృతజ్ఞతగా లబ్ధిదారులు సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.మైదుకూరు పట్టణంలోని స్థానిక కశెట్టి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గ సమన్వయకర్త శెట్టిపల్లె నాగిరెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మరియు నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు హాజరయ్యారు.

యూనివర్సిటీ టాపర్స్ ను… అభినందించిన ఎమ్మెల్యే.మైదుకూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బి.యస్సీ బాటనీ ఫస్ట్ సెమిస్టర్ విద్యార్థి కె.సుజిత, బి.యస్సీ బి.జడ్.సీ థర్డ్ సెమిస్టర్ విద్యార్థి అయేషా లు యూనివర్సిటీ టాపర్స్ గా నిలివగా బి.యస్సీ బి.జడ్.సీ థర్డ్ సెమిస్టర్ విద్యార్థి స్వరూపా యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్ సాధించి ఘనత సాధించారు.వైయస్సార్ చేయూత కార్యక్రమ వేదికపై యూనివర్సిటీ టాపర్స్ గా నిలిచిన విద్యార్థులను ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అభినందించారు.

Related posts

మెగా డీఎస్సీ కోసం మంత్రి బుగ్గన ఇంటి ముట్టడి..

TV4-24X7 News

రేపు వైజాగ్‌లో కాంగ్రెస్ సభ.. హాజరుకానున్న సీఎం రేవంత్

TV4-24X7 News

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకోం: అచ్చెన్న

TV4-24X7 News

Leave a Comment