Tv424x7
National

పేటీఎంపై ఆర్‌బీఐ ఆంక్షలు ఎందుకో తెలుసా

దిల్లీ: పేటీఎం ఫాస్టాగ్‌ యూజర్లకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) బుధవారం కీలక సూచన చేసింది. వినియోగదారులు వెంటనే ఇతర ఫాస్టాగ్‌ సంస్థ లకు మారిపోవాలని కోరింది. పేటీఎం పేమెంట్‌ బ్యాంక్‌ కి భారతీయ రిజర్వు బ్యాంక్‌ ఇచ్చిన గడువు మరో రెండు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో ఈ ప్రకటన చేసింది. దానివల్ల ప్రయాణ సమయంలో టోల్‌ప్లాజాల వద్ద ఎలాంటి ఇబ్బందులూ తలెత్తవని తెలిపింది. పేటీఎంపై ఆర్‌బీఐ ఆంక్షలు విధించడంతో గత నెలలో ఫాస్టాగ్ జారీ చేసే అధీకృత బ్యాంకుల జాబితా నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ను భారతీయ రహదారుల నిర్వహణ కంపెనీ తొలగించింది. ఇకపై ఐహెచ్‌ఎంసీఎల్‌ పేర్కొన్న జాబితాలో ఉన్న బ్యాంకుల నుంచే ఫాస్టాగ్‌ కొనుగోలు చేయాలని యూజర్లకు సూచించింది. ఈ జాబితాలో ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌, అలహాబాద్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఐడీబీఐ బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, యెస్‌ బ్యాంక్‌ సహా మొత్తం 32 బ్యాంకులు ఉన్నాయి. పీపీబీఎల్‌పై ఆర్‌బీఐ విధించిన ఆంక్షలు మార్చి 15 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే ఒకసారి గడువు తేదీని పొడిగించారు. ఈసారి అలాంటి ఉద్దేశమేదీ లేదని తెలిపింది

Related posts

ఏప్రిల్1, 2026 నుంచి ప్రారంభం కానున్న జనాభా గణన.. ముందుగా ఇళ్ల లెక్కింపుతో షురూ..

TV4-24X7 News

జొమాటోకు షాక్.. రూ. 803 కోట్ల జీఎస్‌టీ కట్టాలని నోటీసులు

TV4-24X7 News

2, 3 తేదీల్లో రాష్ట్రపతి భవన్‌లో గవర్నర్ల సదస్సు

TV4-24X7 News

Leave a Comment