కర్నూల్ జిల్లా :నీతికి నిజాయితీకి ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం కాన్షీరామ్ మహిళా ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మీ అన్నారు. కర్నూలులోని స్థానిక బి క్యాంపు నందలి యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక కార్యాలయంలో ఈ రోజు మాన్యశ్రీ కాన్షీరామ్ 90 వ జయంతి కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షురాలు పాలెం రాధ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి మరియు బిసి నాయకులు శేషఫణి మరియు అంబేద్కర్ యువజన సంఘం నాయకులు శేషు లు కలిసి మాన్యశ్రీ కాన్షీరామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా నంది విజయలక్ష్మీ మాట్లాడుతూ బహుజనులకు రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం అని ఆ దిశగా బహుజనులు అందరూ ఏకమవ్వడం ప్రధాన కర్తవ్యమని కాన్షీరామ్ సూచించారని ఆమె అన్నారు. మాన్యశ్రీ కాన్షీరామ్ మహిళల పక్షపాతి అని, దళిత మహిళను ముఖ్యమంత్రిని చేసిన ఘనత కాన్షీరామ్ గారికే దక్కిందని ఆమె తెలిపారు. కాన్షీరామ్ నీతికి నిజాయితీకి ఆత్మ గౌరవానికి నిలువెత్తు నిదర్శనమే కాక అంబేద్కర్ ఆశయాలకు వారసులు అని ఈ సందర్భంగా ఆమె అన్నారు. కాన్షీరామ్ తన జీవిత కాలం అంబేద్కర్ ఆశయ సాధనకు, సామాజిక మార్పుకోసం నిరంతరం శ్రమించి, సామాజిక ఉద్యమకారులు అయిన జ్యోతిబాపూలే అంబేడ్కర్, పెరియార్, సాహు మహారాజ్, నారాయణగురు ల జీవితాలను అధ్యయనం చేసి వారి ఆలోచనా విధానాన్ని కొనసాగించిన మహోన్నత వ్యక్తి మాన్యశ్రీ కాన్షీరామ్ అని ఆమె తెలిపారు.

previous post
next post