ఆంధ్రప్రదేశ్‌లో టమాటా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో టమాటా ధరలు భారీగా పతనమయ్యాయి. ప్రముఖ టమాటా మార్కెట్ అయిన మదనపల్లెలో గ్రేడ్-2 టమాటాల 10 కేజీల బాక్స్ ధర కేవలం రూ.70 మాత్రమే పలుకుతోంది. దీంతో కేజీ ధర రూ.7కు పడిపోయింది.అయితే, రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు కేజీకి కేవలం రూ.3 నుంచి రూ.4.50 మాత్రమే చెల్లిస్తున్నారని, దీంతో పంట సాగుకు పెట్టిన ఖర్చు కూడా తిరిగి రావడం లేదని చెబుతున్నారు.టమాటా సాగుకు ఎకరాకు రూ.3 నుంచి రూ.4 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తోందని, ప్రస్తుతం వస్తున్న ధరలు గిట్టుబాటు కాకపోవడంతో తీవ్ర నష్టాలు చవిచూస్తున్నామని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో కుప్పకూలిన టమాటా ధరలు.. కేజీ రూ.7కే పరిమితం
28
Jul