దువ్వూరు నంద్యాల రోడ్ డ్రైనేజీ సమస్య పరిష్కారానికి చర్యలు

దువ్వూరు నంద్యాల రోడ్ డ్రైనేజీ సమస్య పరిష్కారానికి చర్యలు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

 

మండల కేంద్రమైన దువ్వూరులోని నంద్యాల రోడ్డులో నెలకొన్న డ్రైనేజీ సమస్యను మైదుకూరు శాసనసభ్యులు శ్రీ పుట్ట సుధాకర్ యాదవ్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సమస్యపై స్పందించిన ఎమ్మెల్యే గారు ఇప్పటికే సంబంధిత అధికారులకు సమస్యను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.

ఈ విషయమై స్థానిక దువ్వూరు పట్టణ తెలుగుదేశం పార్టీ కన్వీనర్‌గా నా వంతు బాధ్యతగా సంబంధిత అధికారులను కలిసి సమస్య పరిష్కారానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకోవడం జరిగింది.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, వారం రోజుల్లోగా అవసరమైన చట్టపరమైన అనుమతులు తీసుకుని, డ్రైనేజీ సమస్యకు కారణమవుతున్న ఆక్రమణలను తొలగించి, తాత్కాలిక డ్రైనేజీ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.

ప్రజల సమస్యను పరిష్కరించేందుకు స్పందించిన ఎమ్మెల్యే శ్రీ పుట్ట సుధాకర్ యాదవ్ గారికి, సంబంధిత అధికారులకు ధన్యవాదాలు.

(పాపినేని రాంబాబు,దువ్వూరు పట్టణ టీడీపీ కన్వీనర్)

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *