కడప జిల్లా | ప్రొద్దుటూరు రాజకీయాల్లో ఊహించని సంచలనం!
కూటమి ప్రభుత్వానికి షాక్ ఇచ్చేలా.. ప్రొద్దుటూరు రాజకీయాల్లో వైఎస్సార్‌సీపీ మళ్లీ పుంజుకునేందుకు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి వ్యూహాలకు పదును పెడుతున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
కొత్తపల్లెలో బిగ్ ట్విస్ట్!
నియోజకవర్గంలోని కీలక పంచాయతీల్లో ఒకటైన కొత్తపల్లెపై వైఎస్సార్‌సీపీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మాజీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి సొంత అడ్డాలోనే పార్టీ బలాన్ని పెంచుకునేందుకు రాచమల్లు వర్గం పావులు కదుపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
బావా.. బామ్మర్ది వ్యూహం?
మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, ఆయన బామ్మర్ది బంగారు రెడ్డి కలిసి కొత్తపల్లె పంచాయతీలో పార్టీ పట్టు పెంచుకునేందుకు వ్యూహం రూపొందించినట్లు స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అమృతనగర్‌లో చేరికల జోరు!
ఇక కొత్త అమృతనగర్ ప్రాంతానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరుతున్నట్లు సమాచారం. ఈరోజు ఉదయం 10 గంటలకు జరగనున్న చేరికల కార్యక్రమంతో ప్రొద్దుటూరు రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.
టీడీపీ వర్గాల్లో కలకలం?
వరదరాజుల రెడ్డి, ఆయన కుమారుడు కొండారెడ్డి రాజకీయ వ్యూహాలకు ధీటుగా రాచమల్లు వర్గం ముందుకు వెళ్తోందన్న చర్చ టీడీపీ వర్గాల్లోనూ సాగుతున్నట్లు సమాచారం.
2023 ఎన్నికల సమయంలో ప్రొద్దుటూరులో టీడీపీ జెండా ఎగరనీయనంటూ రాచమల్లు చేసిన సవాల్.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు 2029 ఎన్నికల నాటికి ఏ మేరకు ప్రభావం చూపుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ప్రొద్దుటూరు కోటపై మళ్లీ ఫ్యాన్ జెండా ఎగురుతుందా?
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇరు పార్టీల రాజకీయ వ్యూహాలు మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తోంది. అయితే తాజా పరిణామాలు వైఎస్సార్‌సీపీకి ఎంతవరకు రాజకీయంగా కలిసొస్తాయన్నది వేచి చూడాల్సిందే.రాబోయే రోజుల్లో ప్రొద్దుటూరు పొలిటికల్ వార్ ఏ మలుపు తిరుగుతుందో.. ఎవరి వ్యూహం ఫలిస్తుందో చూడాలి!
Save or share this story as a newspaper-style Epaper Clip: