తిరుపతి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ సోదాలు.. రూ.2.48 లక్షల నగదు స్వాధీనం

 

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

తిరుపతి సిటీ: తిరుపతిలోని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోమవారం సాయంత్రం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసులు సిబ్బందితో కలిసి సాయంత్రం 7 గంటల సమయంలో కార్యాలయానికి చేరుకుని సోదాలు చేపట్టారు.

తనిఖీల్లో లెక్కల్లో చూపని రూ.2.48 లక్షల నగదును ఏసీబీ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించిన వివరాలపై సబ్‌రిజిస్ట్రార్‌ లక్ష్మీదేవిని అధికారులు విచారించారు.

అలాగే కార్యాలయంలోని రిజిస్ట్రేషన్‌ రికార్డులు, సంబంధిత దస్తావేజులు, నగదు లావాదేవీల వివరాలను అధికారులు పరిశీలించారు. సోదాలు కొనసాగుతున్న సమయంలో కార్యాలయంలో ఉన్న డాక్యుమెంట్‌ రైటర్లలో ఆందోళన నెలకొంది. వారిని కూడా ఏసీబీ అధికారులు విచారించినట్లు సమాచారం.

అవినీతికి సంబంధించిన ఫిర్యాదులు అందడంతోనే తనిఖీలు చేపట్టామని ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. అన్‌అకౌంటెడ్‌గా ఉన్న రూ.2.48 లక్షలను స్వాధీనం చేసుకున్నామని, సోమవారం జరిగిన 42 రిజిస్ట్రేషన్లను కూడా పరిశీలిస్తున్నామని ఆయన వెల్లడించారు.

సోదాల్లో లభించిన నగదు, రికార్డులు, రిజిస్ట్రేషన్లకు సంబంధించిన వివరాలపై ఏసీబీ అధికారులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *