ఆగస్టు 15న సన్మానం.. ఇప్పుడు ఏసీబీ కేసు! ‘ఉత్తమ అధికారి’కి ఊహించని షాక్

ఏసీబీకి చిక్కిన ‘ఉత్తమ’ అధికారి!

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

 

ఒంగోలు: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇటీవలే ‘ఉత్తమ అధికారి’గా ప్రశంసా పత్రం అందుకున్న ఓ కార్పొరేషన్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ (ఆర్‌ఐ) లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఘటన ఒంగోలులో కలకలం రేపింది.కొత్తగా నిర్మించిన ఇంటికి పన్ను విధించేందుకు కార్పొరేషన్ ఆర్‌ఐ నరేంద్ర ఓ వ్యక్తి నుంచి రూ.15 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు సమాచారం.ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో వల పన్ని, నరేంద్ర రూ.15 వేల లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం ఆయనపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టారు.ఇదిలా ఉండగా.. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా నరేంద్రకు ‘ఉత్తమ అధికారి’గా ప్రశంసా పత్రం అందినట్లు సమాచారం. మంత్రి, కలెక్టర్ చేతుల మీదుగా ఆయన ఈ సర్టిఫికెట్‌ అందుకున్నారని తెలుస్తోంది.

ఉత్తమ అధికారిగా అవార్డు అందుకున్న కొద్ది రోజులకే లంచం కేసులో ఏసీబీకి చిక్కడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *