పాత దువ్వూరులో రేపు సామూహిక వరలక్ష్మీ వ్రతం

కడప /దువ్వూరు: మండల కేంద్రమైన దువ్వూరు సమీపంలోని పాత దువ్వూరులో వెలసిన శ్రీ కోదండరామ స్వామి దేవస్థానంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో పణి సుజాయశీల, అర్చకులు భూమరాజు నరసింహయ్య తెలిపారు.ఆలయ ఈవో, అర్చకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని మహిళలు భక్తిశ్రద్ధలతో ఆచరించడం ఆనవాయితీగా వస్తోందన్నారు.అయితే ప్రతి ఒక్కరూ స్వయంగా ఏర్పాట్లు చేసుకుని వ్రతాన్ని నిర్వహించుకోవడం సాధ్యం కాకపోవచ్చని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మహిళలందరికీ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో దేవస్థానంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని ఏర్పాటు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని వారు కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *