అమరావతి: శాసనమండలి ఛైర్మన్ మోషేన్‌రాజుపై మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యవహరించిన తీరు బాధాకరంగా ఉందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. సభను మంత్రులు ఏకపక్షంగా నడిపించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.మండలి ఛైర్మన్‌కు మంత్రి నాదెండ్ల పాఠాలు, హితబోధ చేయడం ఏమిటని బొత్స ప్రశ్నించారు. డీఎస్సీ అంశంపై చర్చించాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని స్పష్టం చేశారు.సభా నిబంధనలు అధికార, ప్రతిపక్ష సభ్యులందరికీ సమానంగా వర్తించాలని బొత్స సత్యనారాయణ అన్నారు. సభా వ్యవహారాలను నిబంధనల ప్రకారమే నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: