కార్మికులపై కఠిన నిబంధనలు.. అధికారుల విషయంలో మాత్రం ఎందుకీ భిన్న వైఖరి?

ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో పారిశుద్ధ్యంపై కొత్త చర్చ!

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

కార్మికులపై కఠిన నిబంధనలు.. అధికారుల విషయంలో మాత్రం ఎందుకీ భిన్న వైఖరి?

ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మున్సిపల్ పారిశుద్ధ్య విభాగంలో ప్రస్తుతం కొత్త చర్చకు తెరలేచింది. పట్టణంలో పారిశుద్ధ్య పనుల విషయంలో కార్మికులపై తీవ్ర ఒత్తిడి ఉంటుండగా.. అదే విభాగంలో బాధ్యతలు నిర్వహిస్తున్న కొందరు అధికారుల పనితీరుపై మాత్రం ప్రశ్నలు తలెత్తుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.వీధులు ఒక్కరోజు సక్రమంగా శుభ్రం కాకపోయినా, కాలువల్లో పూడిక తొలగింపులో ఆలస్యం జరిగినా పారిశుద్ధ్య కార్మికులపై అధికారులు, ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పని విషయంలో చిన్నపాటి లోపానికే వివరణలు అడుగుతున్న పరిస్థితుల్లో.. అధికారుల విధుల నిర్వహణపై కూడా అదే స్థాయిలో పర్యవేక్షణ ఉండాలనే డిమాండ్ వినిపిస్తోంది.

అధికారుల పనితీరుపై ప్రశ్నలు

పారిశుద్ధ్య విభాగంలో సుదీర్ఘకాలంగా పనిచేసి పదోన్నతి ద్వారా హెల్త్ విభాగంలో అధికారి స్థాయికి చేరుకున్న ఓ అధికారిపై ప్రస్తుతం విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ కొందరు పారిశుద్ధ్య కార్మికులు ఆరోపిస్తున్నారు.తమపై విధుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న అధికారులు.. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వారి పనితీరును కూడా అదే స్థాయిలో సమీక్షించాలని కార్మికులు కోరుతున్నారు. శారీరక లేదా ఇతర ఇబ్బందులు ఉంటే ఉన్నతాధికారులకు తెలియజేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని వారు సూచిస్తున్నారు.

కొత్త కమిషనర్‌పైనే ఆశలు

ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ విశ్వనాథ్ ఈ వ్యవహారంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.పారిశుద్ధ్య విభాగంలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు, అధికారుల పనితీరు, విధుల పర్యవేక్షణపై సమగ్రంగా పరిశీలన జరిపి.. అందరికీ ఒకే విధమైన నిబంధనలు అమలు చేయాలని కార్మికులు కోరుతున్నారు.

“ఒకరికి ఒక న్యాయం.. మరొకరికి మరో న్యాయమా?”

పట్టణ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలంటే కేవలం కార్మికులపై ఒత్తిడి పెంచడం సరిపోదని.. సంబంధిత అధికారులు కూడా తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించేలా పర్యవేక్షణ ఉండాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.మరి కొత్త కమిషనర్ ఈ అంశాన్ని ఎంతవరకు సీరియస్‌గా తీసుకుంటారు? పారిశుద్ధ్య విభాగంలో విధుల నిర్వహణపై సమగ్ర సమీక్ష చేపడతారా? అందరికీ సమాన నిబంధనలు అమలు చేస్తారా? అనేది వేచి చూడాల్సిందే.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *