శ్రీవినాయక ఫౌండేషన్‌ సేవా కార్యక్రమాలకు అంతర్జాతీయ గుర్తింపు.. మలేషియాలో అవార్డు ప్రదానం

ప్రొద్దుటూరు: పేదలు, నిరుపేదలు, మూగజీవుల ఆకలి తీర్చడంతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న శ్రీవినాయక ఫౌండేషన్‌కు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ దిటి గోపాలకృష్ణయ్య ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాల్లో మిగిలిపోయిన ఆహారాన్ని సేకరించి పేదలకు, నిరుపేదలకు, మూగజీవులకు అందిస్తూ నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన పలు సంస్థలు ఇప్పటికే డాక్టరేట్‌తో పాటు అనేక అవార్డులతో సత్కరించినట్లు తెలిపారు.తాజాగా ఆయన సేవలకు మరో అంతర్జాతీయ గుర్తింపు లభించింది. గ్లోబల్ ఇన్స్పిరేషన్ 2026 అంతర్జాతీయ పురస్కారానికి శ్రీవినాయక ఫౌండేషన్ ఎంపికైంది. ఈ పురస్కారాన్ని మలేషియాలోని హోలంపారులో సెప్టెంబర్ 9న నిర్వహించనున్న కార్యక్రమంలో ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని డాక్టర్ గోపాలకృష్ణయ్యకు ఆహ్వానం అందింది.ఈ సందర్భంగా డాక్టర్ గోపాలకృష్ణయ్య మాట్లాడుతూ.. ప్రజా, సామాజిక సేవా రంగాల్లో విశిష్ట సేవలను గుర్తించి పాన్ ఇండియన్ సోషల్ కల్చర్ అసోసియేషన్ మరియు తెలుగు ఎక్స్‌పర్ట్స్ అసోసియేషన్, మలేషియా సంయుక్త ఆధ్వర్యంలో గ్లోబల్ ఇన్స్పిరేషన్ 2026 అవార్డులను ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు.శ్రీవినాయక ఫౌండేషన్‌ను ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ఎంపిక చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో తమ సేవలకు గుర్తింపు లభించడం మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని పేర్కొన్నారు.

గ్లోబల్ ఇన్స్పిరేషన్ పురస్కారానికి శ్రీవినాయక ఫౌండేషన్ ఎంపిక కావడంపై మండల వ్యాప్తంగా పలువురు హర్షం వ్యక్తం చేస్తూ డాక్టర్ దిటి గోపాలకృష్ణయ్యను అభినందిస్తున్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *