🔴 బ్రేకింగ్ న్యూస్.. మదనపల్లెలో దారుణం
నగల కోసం 83 ఏళ్ల వృద్ధురాలి హత్య?
మదనపల్లె: 83 ఏళ్ల వృద్ధురాలిని దారుణంగా హత్య చేసిన ఘటన మదనపల్లె మండలంలో కలకలం రేపింది. వృద్ధురాలి మృతిపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కొండామారిపల్లి గ్రామంలోని దేవరెడ్డిగారిపల్లికి చెందిన దివంగత నూలు గంగులప్ప భార్య లక్ష్మీదేవి (83) బైపాస్ రోడ్డులో చిల్లర దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగించేవారు.ఆగస్టు 26న ఆమెపై దాడి చేసి హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని తిరుపతి జిల్లా వడమాలపేట మండలం ములగమూడి చెరువులో పాతిపెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నగల కోసమే ఈ హత్య జరిగినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
సమాచారం అందుకున్న తాలూకా పోలీసులు శనివారం ములగమూడి చెరువు వద్దకు చేరుకుని మృతదేహాన్ని వెలికితీయించారు. అనంతరం అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు.
విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు మదనపల్లె బైపాస్ రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. లక్ష్మీదేవి హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వినోద్, ప్రమీలతో పాటు మరో యువకుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
83 ఏళ్ల వృద్ధురాలిపై దాడి చేసి హత్య చేయడానికి మనసెలా వచ్చిందంటూ గ్రామస్తులు తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: