ప్రొద్దుటూరు: నియోజకవర్గంలో జరుగుతున్న స్థానిక సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

నేడు నామినేషన్ల ప్రక్రియలో భాగంగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదంటూ ప్రొద్దుటూరు రూరల్ ఎస్ఐ మల్లికార్జున, సీఐ శివశంకర్ నాయక్ ఆయనకు నోటీసులు జారీ చేశారు.
ఎన్నికల నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ప్రొద్దుటూరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
య
Save or share this story as a newspaper-style Epaper Clip: