కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోని అతిపెద్ద గ్రామ పంచాయతీ అయిన కొత్తపల్లిలో ఇవాళ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది.. ప్రొద్దుటూరుకు ఆయువుపట్టులాంటి ఈ కీలక పంచాయతీలో అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ ఉండే అవకాశం ఉండటంతో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టింది..
మరికొద్ది సేపట్లో కొత్తపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియ అధికారికంగా మొదలుకానున్న నేపథ్యంలో, కార్యాలయ పరిసరాల్లో పోలీసు గట్టి భద్రత చర్యలు చేపట్టారు.. నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా సాగేలా ఉన్నతాధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు..
Save or share this story as a newspaper-style Epaper Clip: