దీపాల వెలుగుల్లో భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి దివ్యదర్శనం
కార్తీక మాసం రెండవ సోమవారం సందర్భంగా అల్లాడుపల్లి ఆలయంలో ప్రత్యేక ఆధ్యాత్మిక సందడి
కార్తీక మాసం రెండవ సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకుని అల్లాడుపల్లిలోని శ్రీ భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి వారి ఆలయం భక్తిశోభతో అలరారింది. ఈ సందర్భంగా స్వామివారికి భక్తిపూర్వకంగా దివ్య హారతి సమర్పించారు. ఆలయంలో వెలిగించిన దీపాల కాంతుల నడుమ స్వామివారి దర్శనం భక్తులకు ప్రత్యేక ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది.
కార్తీక సోమవారం సందర్భంగా స్వామివారిని దర్శించుకుని భక్తులు తమ కుటుంబాల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించారు.
ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్ర స్వామియే నమః
Save or share this story as a newspaper-style Epaper Clip: