AP News: అమరావతి: ఏపీలో ఐఏఎస్ అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) కొరడా ఝుళిపించింది. ముగ్గురు కలెక్టర్లపై సీఈసీ మంగళవారం నాడు వేటు వేసింది..కృష్ణాజిల్లా కలెక్టర్ రాజాబాబు, అనంతపురం కలెక్టర్ గౌతమి, తిరుపతి కలెక్టర్ లక్ష్మీ షా పై వేటు పడింది. ఈరోజు సాయంత్రం ఐదు గంటల్లోపు బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఆదేశించింది. వీరి స్థానంలో వెంటనే ప్యానల్ పంపాలని కూడా ఆదేశించింది.చీఫ్ సెక్రటరీకి ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ ముగ్గురు అధికారులు ఎన్నికల కమిషన్ నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా అధికార పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నారని పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో ఈచర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఫిర్యాదులను విచారించి నివేదిక ఇవ్వాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నివేదిక మేరకు ఈ ముగ్గురు కలెక్టర్లను సీఈసీ బదిలీ చేసింది

previous post