Tv424x7
Andhrapradesh

తిరుపతిలో 15 ఏనుగుల బీభత్సం.. అన్నదాతల కన్నీరు…

AP News: తిరుపతిలో (Tirupati) ఏనుగుల బీభత్సం అంతా ఇంతా కాదు. గజరాజుల (Elephants) విజృంభన రైతులకు ఆవేదనను మిగిల్చింది. గత కొద్ది రోజులుగా ఏనుగుల హల్‌చల్‌తో రైతులు బెంబేలెత్తిపోతున్నారు..రేణిగుంట మండలం చైతన్యపురం గ్రామంలో ఏకంగా 15 ఏనుగుల సంచారంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏనుగుల బీభత్సంతో పంట పొలాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో మామిడి పంటపై ఆధారపడ్డ రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.దాదాపు 80 ఎకరాల్లో మామిడి తోటలు ధ్వంసమయ్యాయి. గతంలోనూ ఇలాంటి దాడులు జరిగాయని రైతులు వాపోతున్నారు. గజరాజుల విహారంపై అటవీశాఖ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఫలితం మాత్రం శూన్యం అని మామిడి రైతులు ఆవేదన చెందుతున్నారు. రాత్రి పంటలను ధ్వంసం చేస్తున్న ఏనుగుల నుంచి మామిడి చెట్లను రక్షించుకోవడానికి ప్రాణాలకు తెగించి తమ వద్దనున్న బాణాసంచాను పేల్చి రైతులు ఏనుగులను తరిమే ప్రయత్నం చేశారు. అయినా ఎలాంటి లాభం లేకుండా పోయిందని అన్నదాతలు చెబుతున్నారు. పూర్తిగా నష్టపోయిన తమను ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు న్యాయం చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు..

Related posts

భార్య గొంతు కోసిన భర్త

TV4-24X7 News

ఏపీలో సీపెట్ కు దరఖాస్తుల స్వీకరణ

TV4-24X7 News

డిల్లి కి బయలుదేరిన సీఎం చంద్ర బాబు

TV4-24X7 News

Leave a Comment