విజయవాడ, ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు హుండీల ద్వారా రూ. 2.76 కోట్ల నగదును కానుకలు, మొక్కుబడులుగా భక్తులు సమర్పించారు. సోమవారం హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. 19 రోజులకు గాను రూ. 2,76,11,524
478 గ్రాముల బంగారం, 4.830 కిలోల వెండి లభ్యమైంది. ఈ హుండీ ద్వారా రూ. 70,541 విరాళాలను దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అమ్మవారికి సమర్పించారు.