Tv424x7
Andhrapradesh

కూటమిలోకి ఎంట్రీ లేకనే వాసుపల్లి కొత్త డ్రామా మానసిక ఆస్పత్రిలో చికిత్స అవసరం

విశాఖ దక్షిణ నియోజక వర్గం మాజీ ఎమ్మేల్యే వాసు పల్లి గణేష్ కుమార్ వ్యాఖ్యలు గర్హనీయం అని జనసేన ఉత్తరాంధ్ర కో కన్వినర్ , జనసేన కార్పొరేటర్ మహమ్మద్ సాధిక్ పేర్కొన్నారు.సీతంపేట దరి రాజేంద్ర నగర్ లో గల జనసేన నగర పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అన్ని పంచాయతీలలో గ్రామ సభలు నిర్వహణకు గానూ గిన్నిస్ బుక్ ప్రపంచ రికార్డు నమోదు చేశారు అన్నారు. వాసు పల్లి గణేష్ కుమార్ టీడీపీ, జన సేన పార్టీ లో చేరడానికి పైరవీలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు విఫల మయ్యి జగన్, వై వి సుబ్బా రెడ్డి మీద పొగడ్తలు డ్రామా ఆడుతున్నారు. గత ఎన్నికల్లో నాలుగో వంతు ఓట్లు కూడా రాలేదు. సిఎం చంద్ర బాబు నాయుడు ఈ వయసులో కూడా కష్టపడి పని చేస్తున్నారు అని కొనియాడారు. వాసు పల్లి కి ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పి ఇంటికి పంపించారు. ప్రభుత్వ మానసక ఆస్పత్రిలో తనిఖీలు చేసుకోవాలి అని హితవు పలికారు. ఎమ్మెల్యే గా వున్నపుడు చేసిన అక్రమాలు బయటకు వస్తాయి, చర్యలకు సిద్ధంగా ఉండాలి. వాసు పల్లి గతంలో హౌసింగ్ స్కాం చేశారు అని ఆరోపించారు. వాసుపల్లి కి కూటమి పార్టీలో ప్రవేశం లేదు అని ఆయన స్పష్టం చేశారు. వైసిపి త్వరలో మునిగిపోయే పార్టీ అన్నారు. వైసిపి నేతలు నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలి అని కోరారు. టీటీడీ లడ్డూ గురించి ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్ లో జంతు కొవ్వు వుంది అని వుండడం విచారకరం అన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బ తిన్నాయి అన్నారు. వైసిపి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పు ల్లో ముంచేసారు. తెలంగాణ, కర్నాటక ఇబ్బందులు దృష్టిలో వుంచుకుని ఉచిత బస్సు హామీ అమలు కానుంది అని స్పష్టం చేశారు.మీడియా సమావేశంలో సూరాడ తాతా రావు, మీసాల వెంకట్ రావు, మోడి శెట్టి రమణ, మోతి పాల్గొన్నారు.

Related posts

పెన్షన్ల పంపిణీ ప్రారంభించిన సీఎం చంద్రబాబు

TV4-24X7 News

పవన్ ఎఫెక్ట్ – చంద్రబాబు అలర్ట్, కీలక మార్పు..!!

TV4-24X7 News

ఏపీలో ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల వైద్య సాయం: మంత్రి సత్యకుమార్

TV4-24X7 News

Leave a Comment