Tv424x7
Telangana

రాష్ట్రంలో పాలు జిల్లాలో భారీ వర్షం – కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం

భానుడి భగభగలతో ఇన్నాళ్లు అల్లాడిన ప్రజలకు వర్షాలు కాస్త ఉపశమనం కలిగిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ తెల్లవారుజాము నుంచి పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది.కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వాన పడుతోంది. ముఖ్యంగా వరంగల్‌, హనుమకొండ, కాజీపేట, ధర్మసాగర్, వేలేరు మండలాల్లో, జనగామ: స్టేషన్ ఘనపూర్‌లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది. స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలంలో వడగండ్ల వాన కురుస్తుండటంతో ఐకేపీ సెంటర్‌లో నిల్వ చేసిన ధాన్యం తడిసిపోయింది.సిద్దిపేట జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. అకాల వర్షం అన్నదాతలకు అపార నష్టాన్ని మిగిల్చింది. ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తుండటంతో మామిడి, నిమ్మ పంటలు నేలరాలుతున్నాయి. వర్షానికి సిద్దిపేట పట్టణంలోని మార్కెట్ యార్డులో ఉన్న పత్తి , కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దయింది. పలుచోట్ల చేతికి వచ్చిన వరి పంట, మామిడికాయలు నేలరాలాయి. కొనుగోలు కేంద్రాల్లో సరైన వసతులు లేకపోవడంతో ధాన్యం తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Related posts

లైంగిక వేధింపుల కేసులో సీఐ సస్పెండ్?

TV4-24X7 News

రైతుకు బేడీలు వేయాల్సిన అవసరం ఏమొచ్చింది?.. సీఎం రేవంత్‌ సీరియస్‌

TV4-24X7 News

నేటి నుండి ఇంజనీరింగ్ విద్యార్థులకు వెబ్ ఆప్షన్లు

TV4-24X7 News

Leave a Comment