Tv424x7
Andhrapradesh

రూపాయల కే భోజనం.. విజయవాడ రైల్వే స్టేషన్ లో స్పెషల్ కౌంటర్

విజయవాడ :ప్రయాణికులకు 20/- రూపాయలకే భోజనం అందుబాటులోకి తెచ్చిన ఐఆర్ సీటీసీజనరల్ బోగీ నిలిచే చోట ఏర్పాటు చేసిన అధికారులువేసవి పూర్తయ్యే వరకూ స్పెషల్ కౌంటర్ ఉంటుందని వెల్లడివేసవి సందర్భంగా ప్రత్యేక రైళ్లతో పాటు విజయవాడ రైల్వే అధికారులు స్పెషల్ భోజనమూ అందిస్తున్నారు.. ప్రయాణికుల కోసం ఎకానమీ మీల్స్ పేరుతో రూ.20 లకే నాణ్యమైన భోజనం అందుబాటులోకి తెచ్చారు. దీనికోసం రైల్వే స్టేషన్ లో జనరల్ బోగీలు ఆగే చోట ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేశారు. రూ.20 లకే ఎకానమీ మీల్స్, రూ.50 లకు స్నాక్ మీల్స్ అందిస్తున్నారు. వేసవిలో ప్రయాణికులకు తక్కువ ధరకే నాణ్యమైన భోజనం అందించాలని ఐఆర్ సీటీసీతో కలిసి ఈ ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.జనరల్ బోగీలలో ప్రయాణించే ప్రయాణికుల ఆకలి తీర్చడమే లక్ష్యంగా ఈ కౌంటర్ ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వేసవి పూర్తయ్యే వరకూ ఈ స్పెషల్ కౌంటర్ ఉంటుందని వివరించారు. ప్రస్తుతానికి ఈ కౌంటర్లను ప్రయోగాత్మకంగా విజయవాడ, రాజమహేంద్రవరం స్టేషన్లలో ఏర్పాటు చేసినట్లు డీఆర్‌ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్‌ వివరించారు.

Related posts

పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లిన చంద్రబాబు.

TV4-24X7 News

ఏపీలో ఇకపై ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఉండవా???

TV4-24X7 News

చదువు రాని వాళ్ళు ఛానల్ పెడుతుంటే చదువుకొని ఎంపీ నైన నేను పెట్టలేనా

TV4-24X7 News

Leave a Comment