Tv424x7
Andhrapradesh

కొడాలి నాని నామినేషన్ పై వివాదం

గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడ అసెంబ్లీ వైకాపా అభ్యర్థి, మాజీ మంత్రి కొడాలి నాని నామినేషన్‌పై వివాదం ఏర్పడింది. నామినేషన్‌ పత్రాల్లో తప్పుడు సమాచారం చేర్చారంటూ రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో)కు తెదేపా నేతలు ఫిర్యాదు చేశారు. మున్సిపల్‌ కార్యాలయాన్ని క్యాంపు కార్యాలయంగా వినియోగించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. భవనాన్ని అద్దెకిచ్చినట్లు అధికారులు పేర్కొన్న పత్రాలను దీనికి జత చేశారు. తప్పుడు సమాచారమిచ్చిన నాని నామినేషన్‌ను తిరస్కరించాలని కోరారు. ఏ ప్రభుత్వ కార్యాలయాన్నీ వినియోగించలేదని కొడాలి నాని తన అఫిడవిట్‌లో పేర్కొన్న నేపథ్యంలో ఆధారాలతో తెదేపా ఫిర్యాదు చేసింది. రిటర్నింగ్‌ అధికారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Related posts

మొన్నటి వరకు 3.. ఇప్పుడు నాలుగో రాజధాని అంటున్నారు: చంద్రబాబు

TV4-24X7 News

బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదు

TV4-24X7 News

సి ఎం చంద్రబాబుకు అందించిన వినతికి స్పందన

TV4-24X7 News

Leave a Comment