Tv424x7
Andhrapradesh

దివ్య ఫార్మసీ (పతంజలి) ఉత్పత్తుల తయారీ లైసెన్స్‌ రద్దు

.పతంజలికి చెందిన 10 దివ్య ఫార్మసీ ఉత్పత్తుల తయారీని లైసెన్స్ను ఉత్తరాఖండ్ ప్రభుత్వం రద్దు చేసింది. ఉత్తరాఖండ్ డ్రగ్ లైసెన్సింగ్ అథారిటీ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వాణిజ్య ప్రకటనలు ఇచ్చారని నిర్ధరణ అయిన నేపథ్యంలో ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.వాణిజ్య ప్రకటన విషయంలో ‘డ్రగ్స్ అండ్ మ్యాజిక్‌ రెమిడీస్‌ యాక్ట్‌’, ‘డ్రగ్స్‌ అండ్‌ కాస్మెటిక్‌ యాక్ట్‌’ను పతంజలి ఉల్లంఘించినట్లు తేల్చిన అథారిటీ .. ఉత్పత్తులకు సంబంధించి ప్రచారం చేసిన ప్రయోజనాలపై ఆధారాలను సమర్పించడంలో విఫలమైనట్లు తెలిపింది. తమ వాదనను సమర్థించుకుంటూ ఇచ్చిన సమాధానం కూడా సంతృప్తికరంగా లేదని ఈ నేపథ్యంలోనే లైసెన్స్ రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.ఆధునిక వైద్య విధానాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పతంజలి సంస్థపై ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా.. విచారణ జరిపిన న్యాయస్థానం-అసత్య, తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వొద్దని హెచ్చరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ అంశం సర్వోన్నత న్యాయస్థానం పరిధిలో ఉంది.

Related posts

ఈ నెల 13న అనంతకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్… ?

TV4-24X7 News

ఒక్క ఓటు చీలకూడదు.. టీడీపీ, జనసేన కలిసి పనిచేయాలి.

TV4-24X7 News

పదేళ్లుగా దేశంలో పేదరికం క్రమంగా తగ్గుతోంది: మోదీ

TV4-24X7 News

Leave a Comment