ఈవీఎంను పిన్నెల్లి ధ్వంసం చేసే వీడియోను తాము విడుదల చేయలేదని CEO ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. ఆ వీడియో ఎన్నికల కమిషన్ నుంచి బయటకు వెళ్లలేదని, ఎలా వైరల్ అయిందో తెలుసుకుంటామని మీడియాతో చిట్చాట్లో వ్యాఖ్యానించారు. పాల్వాయిగేటు PO, APOను సస్పెండ్ చేశామన్నారు. ఇప్పుడే మాచర్లలో పరిస్థితి అదుపులోకి వచ్చిందన్నారు. TDP నేతలు మాచర్ల వెళ్లడం సరికాదని, మళ్లీ పరిస్థితి అదుపుతప్పే అవకాశం ఉందన్నారు.

previous post
next post